Breaking News

Olympics 2024: భారత్‌ ఖాతాలో రెండో పతకం

Published on Tue, 07/30/2024 - 13:20

Olympics 2024 Day 4: ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్‌ మెడల్‌ అందించారు. 

దక్షిణ కొరియా జోడీ(జిన్‌ ఓయె–లీ వన్‌హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.

సరబ్‌జోత్‌కు తొలి మెడల్‌
మరోవైపు.. పురుషుల వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్‌ అవకాశాలు చేజార్చుకున్న సరబ్‌జోత్‌కు మిక్స్‌డ్‌ ఈవెంట్లో మాత్రం లక్‌ కలిసి వచ్చింది. పేలవంగా ఆరంభించినా మనూ ఆది నుంచే ఆకట్టుకోవడంతో కొరియన్‌ జంటను ఓడించగలిగారు. ఫలితంగా మనూ ఖాతాలో రెండో పతకం చేరగా.. సరబ్‌జోత్‌ తొలి మెడల్‌ను ముద్దాడాడు.

ఇక సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్‌ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)