Breaking News

Paris Olympics 2024: లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో మహిళా బాక్సర్‌ ఓటమి

Published on Thu, 08/01/2024 - 19:28

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్‌ పోటీల్లో ఓ బాక్సర్‌ లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్జీరియాకు చెందిన ఇమేన్‌ ఖెలిఫ్‌, ఇటలీకి చెందిన ఏంజెలా కారిని 66 కేజీల ప్రిలిమినరీ రౌండ్‌లో తలపడ్డారు. ఈ గేమ్‌లో ఖెలిఫ్‌ కేవలం 46 సెకెన్లలో విజయం సాధించింది. ఖెలిఫ్‌ పిడిగుద్దుల ధాటికి ఏంజెలా కారిని ముక్కు విరిగినంత పనై, బౌట్‌ నుంచి నిష్క్రమించింది. కారిని బౌట్‌ నుంచి వైదొలగడానికి ముందు రెండుసార్లు ఆమె హెడ్‌ సేఫ్టీ తొలగిపోయింది. 

ఖెలిఫ్‌ రెండు పర్యాయాలు బలంగా కారిని తల భాగంపై అటాక్‌ చేసింది. ముక్కులో తీవ్రమైన నొప్పి రావడంతో బౌట్‌ నుంచి వైదొలిగినట్లు కారిని గేమ్‌ అనంతరం వివరించింది. కారిని నొప్పితో విలవిలలాడుతూ కన్నీటిపర్యంతమైంది. గేమ్‌ అనంతరం ఆమె ఖెలిఫ్‌కు కరచాలనం కూడా చేయలేదు. 

కాగా, కారినిని తీవ్రంగా గాయపరిచి క్షణాల్లో గేమ్‌ను గెలిచిన ఖెలిఫ్‌.. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమై 2023 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఖెలిఫ్‌ వివాదాల నడుమ పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధిని తీవ్రంగా గాయపరిచి మ్యాచ్‌ను గెలిచింది.  మగ లక్షణాలున్న బాక్సర్‌ చేతిలో ఓటమి తర్వాత కారినిపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. కారినికి అన్యాయం జరిగిందని కామెంట్స్‌ చేస్తున్నారు.
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)