Breaking News

‘పారిస్‌’ టికెట్ల కోసం 40 లక్షల మంది దరఖాస్తు 

Published on Sat, 04/22/2023 - 10:09

Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండో దశలో 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా 13 లక్షల మందిని ఎంపిక చేస్తారు. తొలి దశలో 32 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.  

సెమీస్‌లో బోపన్న జోడీ 
బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–ఎడ్వర్డ్‌ రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంటను ఓడించింది.

64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్‌ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశారు.    

మే 28న అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌ 
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 16వ సీజన్‌ ప్లే ఆఫ్‌ దశ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మే 23న క్వాలిఫయర్‌–1 మ్యాచ్‌కు... మే 24న ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తుంది.

మే 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌కు, మే 28న ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)