Sumit Antil: ప్రపంచ రికార్డు... పసిడి పతకం

Published on Tue, 08/20/2024 - 05:11

న్యూఢిల్లీ: పారిస్‌ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని భారత పారాథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ పేర్కొన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్‌ 8 వరకు పారాలింపిక్స్‌ జరగనుండగా... ఆరంభ వేడుకల్లో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ భారత బృందం పతాకధారిగా వ్యవహరించనున్నాడు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్‌.. ఎఫ్‌64 విభాగంలో పోటీపడనున్నాడు. 

తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల మూడుసార్లు బద్దలు కొట్టిన సుమిత్‌... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్నాడు. పారా ప్రపంచ చాంపియన్‌సిప్‌లోనూ సుమిత్‌ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. డిఫెండింగ్‌ పారాలింపిక్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న సుమిత్‌ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పసిడి పతకం గెలవాలనుకుంటున్నా.

 ప్రాక్టీస్‌ లో నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నిరంతరం ప్రయతి్నస్తున్నా. 80 మీటర్ల మార్క్‌ అందుకోవడం నా లక్ష్యం. డిఫెండింగ్‌ చాంపియన్‌ అనే ఒత్తిడి ఏం లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే దృష్టి పెడతా. 2019 నుంచి టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌లో భాగంగా ఉన్నా. ప్రభుత్వ సహకారం వల్లే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతున్నా. పారాలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఉద్దేశంతో ఇతర టోరీ్నల్లో ఎక్కువ పాల్గొనలేదు’ అని సుమిత్‌ అన్నాడు. పారాలింపిక్స్‌లో భారత్‌ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)