Breaking News

పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత

Published on Tue, 05/07/2024 - 06:24

నసావు (బహామస్‌): వరల్డ్‌ అథ్లెటిక్స్‌ రిలే పోటీల్లో రాణించిన భారత పురుషుల, మహిళల 4 x 400 రిలే జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, రూపల్‌ చౌధరీ, పూవమ్మ, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల రిలే జట్టు రెండో హీట్‌లో 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకొని పారిస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

4  400 మీటర్ల విభాగంలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో భారత జట్టు అర్హత పొందలేదు. మరోవైపు అనస్‌ యాహియా, మొహమ్మద్‌ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్‌ జేకబ్‌లతో కూడిన భారత పురుషుల 4 x 400 మీటర్ల రిలే జట్టు కూడా పారిస్‌ ఒలింపిక్స్‌ టికెట్‌ను దక్కించుకుంది. 

రెండో హీట్‌లో అనస్, అజ్మల్, అరోకియా, అమోజ్‌ బృందం 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో ఒలింపిక్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత పురుషుల రిలే జట్టుకిది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో, ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో భారత రిలే జట్టు పతకాలు సాధించకపోయినా కొత్త ఆసియా రికార్డులను నెలకొలి్పంది. వరల్డ్‌ రిలే పోటీల ద్వారా మొత్తం 70 జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు