Breaking News

పంకజ్‌... అదే జోరు

Published on Fri, 02/21/2025 - 04:33

దోహా: భారత క్యూస్పోర్ట్స్‌ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్‌ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్‌ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్‌ల తేడాతో ఇరాన్‌కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌ అమిర్‌ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్‌ కావడం విశేషం. 

ఇదివరకే అతను స్నూకర్‌లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్‌ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్‌తో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్‌లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్‌ స్నూకర్‌లో లిఖించాల్సి ఉంది. 

ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్‌ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్‌ విజయానంతరం పంకజ్‌ అద్వానీ అన్నాడు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)