Breaking News

పాకిస్తాన్‌ బ్యాటర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 34 పరుగులు! వీడియో వైరల్‌

Published on Tue, 04/04/2023 - 13:23

రంజాన్ మాసం సంద‌ర్భంగా జ‌రుగుతున్న ఘ‌నీ రంజాన్ టోర్నీలో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఉస్మా మీర్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో జీఐసీ జట్టుకు ఉస్మా మీర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం కరాచీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మా మీర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న మీర్‌ 7 సిక్స్‌లు, 2 ఫోర్లు సాయంతో 66 పరుగులు చేశాడు.

ముఖ్యంగా జీఐసీ ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌ వేసిన బిలాల్‌కు మీర్‌ చుక్కలు చూపించాడు. ఆ ఓవ‌ర్‌లో అతడు.. 5 సిక్స్‌లు, 1 ఫోర్‌ సాయంతో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఉస్మా మీర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా జీఐసీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది.

కాగా ప్రతీ ఏడాది రంజాన్ నెల స‌మ‌యంలో పాకిస్తాన్‌లో ఘ‌నీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 8 జ‌ట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జ‌ట్టులో ఇద్దరు అంత‌ర్జాతీయ క్రికెట‌ర్లకు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఇక ఉస్మా మీర్‌ పాక్‌ తరుపున ఇప్పటివరకు మూడు వన్డేలు మాత్రమే ఆడాడు.
చదవండి: IPL 2023: యువ బౌలర్‌కు క్లాస్‌ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)