Breaking News

పాకిస్తాన్‌కు మ‌రో బిగ్ షాక్‌.. 59 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి

Published on Thu, 09/05/2024 - 08:03

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ పరాజయంతో టెస్టుల్లో పాకిస్తాన్‌ ర్యాంక్‌ మరింత దిగజారింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్‌ 8వ స్థానానికి పడిపోయింది. రావల్పిండి వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ అయింది. 

బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం పాకిస్తాన్‌ జట్టుకు ఇదే తొలిసారి. ఒక్క టెస్టులోనూ పోరాటాన్ని కనబర్చలేకపోయిన పాక్‌ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కంగుతింది. ‘ఐసీసీ పురుషుల టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాక్‌ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయింది’ అని ఐసీసీ వెబ్‌సైట్‌లో తెలిపింది. 

సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌ ఆరో ర్యాంక్‌లో ఉంది. రెండు వరుస పరాజయాలతో వెస్టిండీస్‌ (7వ ర్యాంక్‌) కంటే దిగువ ర్యాంక్‌కు చేరింది. 1965 తర్వాత పాక్‌ ఇలా ర్యాంకింగ్స్‌లో దిగజారడం ఇదే తొలిసారి. అయితే పాక్‌ను వైట్‌వాష్‌ చేసినప్పటికీ బంగ్లాదేశ్‌ 9వ ర్యాంక్‌లో మార్పు లేదు. 

కానీ బంగ్లాదేశ్‌ జట్టు 13 రేటింగ్‌ పాయింట్లు మెరుగుపరుచుకుంది. త్వరలోనే బంగ్లాదేశ్‌... భారత్‌ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)