Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌ చారిత్రక ఒప్పందం!

Published on Thu, 07/02/2026 - 13:41

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా క్రికెట్‌ ఫెడరేషన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించేందుకు పీసీబీ ముందుకు వచ్చింది.

కాగా సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కూడా లేదు. స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే క్రమంలో లోకల్‌ గ్రౌండ్లలో మాత్రమే టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియన్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ (SACF) ఆట అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్టేడియాలు కూడా అవసరమని భావించింది.

ఈ క్రమంలోనే స్టేడియం నిర్మాణం కోసం పీసీబీని సంప్రదించింది. ఇందులో భాగంగా జెద్దాలో ఇంటర్నేషనల్‌ స్టేడియం నిర్మాణం కోసం పీసీబీతో మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (MOU) కుదుర్చుకుంది. ఈ క్రమంలో పీసీబీ.. స్టేడియం డిజైన్‌, పిచ్‌ల రూపకల్పన, సహాయక సిబ్బంది శిక్షణ, ఆతిథ్యం, ప్రసారాలు.. తదితర అంశాల్లో సౌదీకి సాయం చేయనుంది.

సౌదీ బోర్డుకు ఒక సాంకేతిక భాగస్వామి (టెక్నికల్‌ పార్ట్‌నర్‌)లా పీసీబీ వ్యవహరించనుంది. సౌదీ విజన్‌ 2030 (స్పోర్టింగ్‌ పోర్ట్‌ఫోలియో)లో భాగంగా పాక్‌తో సౌదీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి కాలంలో సౌదీ ఫుట్‌బాల్‌, ఎఫ్‌1, గోల్ఫ్‌, బాక్సింగ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది.

ఇక గల్ఫ్‌ ప్రాంతంలో ఎక్కువగా భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక నుంచి వచ్చిన వారు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా క్రికెట్‌కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జెద్దాలో తొలి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి పూనుకుంది.

పీసీబీతో సౌదీ బోర్డు కుదుర్చుకున్న MOUలోని ప్రధాన అంశాలు
👉జెద్దాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం, అభివృద్ధి
👉జెద్దాలో అంతర్జాతీయ మ్యాచ్‌, ఈవెంట్ల నిర్వహణ
👉క్రికెట్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి: ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్‌ అఫీషియల్స్‌కు అవకాశాలు పెంచడం
👉క్రికెట్‌ అభివృద్ధి: తరచూ మ్యాచ్‌లు నిర్వహించడం, టెక్నికల్‌ ప్రోగ్రామ్స్‌, నైపుణ్యాల మార్పిడి.
👉స్పోర్ట్‌ టూరిజంలో పెట్టుబడులు
👉సౌదీ విజన్‌ 2030: క్రీడా రంగానికి మద్దతు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)