Breaking News

చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా

Published on Fri, 12/20/2024 - 15:23

వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్‌.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికాపై 81 ప‌రుగుల తేడాతో పాక్ ఘ‌న విజ‌యం సాధించింది.

త‌ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చ‌రిత్ర సృష్టించింది.

దక్షిణాఫ్రికాలో పాక్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్‌లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్‌​ గ్రీన్‌.. మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

ఓవరాల్‌గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్‌ 22న జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరగనుంది.
చదవండి: జాకెర్‌ అలీ మెరుపు ఇన్నింగ్స్‌.. వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)