‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో పేస్, విజయ్‌ అమృత్‌రాజ్‌

Published on Mon, 07/22/2024 - 01:20

న్యూపోర్ట్‌ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారులు లియాండర్‌ పేస్, విజయ్‌ అమృత్‌రాజ్‌లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్‌ ‘హాఫ్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్‌ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్‌ వరుసగా ఏడు ఒలింపిక్స్‌ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్‌ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.

1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్‌ డేవిస్‌కప్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో పురుషుల డబుల్స్‌లో 8 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 10 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను గెల్చుకున్న పేస్‌కు ‘ప్లేయర్‌ కేటగిరీ’లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ఎంపిక చేశారు.

ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్‌ ప్లేయర్‌ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్‌ అమృత్‌రాజ్‌ 1974, 1987లలో భారత జట్టు డేవిస్‌కప్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్‌ ప్లేయర్లకు ‘హాఫ్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానాన్ని కల్పించారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)