Breaking News

Olympics: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జోడీ

Published on Fri, 08/02/2024 - 18:34

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ మరో పతకానికి చేరువైంది. మిక్స్‌డ్‌ ఆర్చరీ టీమ్‌ ఈవెంట్లో  బొమ్మదేవర ధీరజ్‌- అంకితా భకత్‌ జోడీసెమీ ఫైనల్‌ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్‌ ఫైనల్లో స్పానిష్‌ జంట కనాలెస్‌- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్‌ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.

తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్‌ పోరులో సౌత్‌ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్‌- సౌత్‌ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్‌ పోటీ మొదలుకానుంది.

కాంస్య పతక పోరులో భారత్‌ ఓటమి

మిక్స్‌డ్‌ ఆర్చరీ టీమ్‌ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్‌- అంకితా భకత్‌ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్‌ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. 

సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లు
సెమీ ఫైనల్లో సౌత్‌ కొరియా జోడీ లిమ్‌- కిమ్‌ జోడీ చేతిలో ధీరజ్‌- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్‌ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.

ఇప్పటికి మూడు పతకాలు
ప్యారిస్‌లో ఇప్పటికే భారత్‌ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్‌, స్వప్నిల్‌ కుసాలే.. టీమ్‌ ఈవెంట్లో సరబ్‌జోత్‌ సింగ్‌ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్‌ మెడల్‌(కాంస్యం), స్వప్నిల్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)