Breaking News

Paris Olympics: ఆస్ట్రేలియాను ఓడించిన భారత్‌.. 52 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి

Published on Fri, 08/02/2024 - 18:20

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త హాకీ జ‌ట్టు మ‌రో అద్భుత విజయం సాధించింది. శుక్ర‌వారం పూల్‌-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో 3-2 తేడాతో భార‌త్ గెలుపొందింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జ‌ట్టుపై భార‌త్ విజ‌యం సాధించ‌డం 52 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం. 

చివ‌ర‌గా జ‌ర్మ‌నీ వేదిక‌గా జ‌రిగిన‌  1972 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జ‌ట్టును భార‌త్ ఓడించింది. మ‌ళ్లీ ఇప్పుడు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాను భార‌త హాకీ జ‌ట్టు చిత్తు చేసింది.  ఇక ఈ విజ‌యంతో టీమిండియా లీగ్ స్టేజి(పూల్‌-బి)ని రెండో స్ధానంతో ముగించింది. పూల్‌-బిలో బెల్జియం తొలి స్ధానంలో ఉంది.

 ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త విజ‌యంలో కెప్టెన్ హర్మ‌న్ ప్రీత్ సింగ్ మ‌రోసారి కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుత‌మైన గోల్స్‌తో హర్మ‌న్ ప్రీత్ మెరిశాడు. అత‌డితో పాటు అభిషేక్ ఓ గోల్ సాధించాడు. మ‌రోవైపు ఆస్ట్రేలియా సెకెండ్ క్వార్ట‌ర్‌లో ఓ గోల్ సాధించ‌గా.. ఆఖ‌రి క్వార్ట‌ర్‌లో మ‌రో గోల్ చేసింది. ఇక క్వార్ట‌ర్ ఫైన‌ల్లో భార‌త్ జ‌ర్మ‌నీ లేదా గ్రేట్ బ్రిట‌న్‌తో త‌ల‌పడనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)