మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన వినేశ్
Published on Tue, 08/06/2024 - 15:36
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఊహించని పరిణామం!!!.. వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్.. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్‌ను మట్టికరిపించిన వైనం!!!. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బకొట్టి పతక రేసులో నిలిచిన అపూర్వ తరుణం. ఈ సంచలనం సృష్టించింది మరెవరో కాదు.. మన రెజ్లర్ వినేశ్ ఫొగట్.
అవును... భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చారిత్రాత్మక విజయం సాధించింది. వుమెన్స్ 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత యీ సుసాకీని 3-2తో ఓడించింది.
జపాన్ రెజ్లర్‌పై పైచేయి సాధించి సగర్వంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఒక్సానా లివాచ్‌తో వినేశ్ తలపడనుంది.
WHAT HAVE YOU DONE VINESH!!!
Vinesh Phogat has defeated the Tokyo Olympics GOLD medalisthttps://t.co/IPYAM2ifqx#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/RcnydCE3mk— JioCinema (@JioCinema) August 6, 2024
Tags : 1