Breaking News

Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ

Published on Wed, 07/31/2024 - 15:34

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో ఐదోరోజు భారత్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ సైతం రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాడు.

మూడో సీడ్‌ పై లక్ష్య  గెలుపు
బుధవారం నాటి మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్‌, మూడో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్‌ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్‌లో అన్‌సీడెడ్‌ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్‌ నంబర్‌ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్‌. 

 

ఆకుల శ్రీజ సంచలన విజయం
మరోవైపు.. వుమెన్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్‌ ఆఫ్‌ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్‌ చేరిన ప్లేయర్‌గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌ 16 శ్రీజ.. సింగపూర్‌కు చెందిన జియాన్‌ జెంగ్‌తో తలపడింది.

తొలి గేమ్‌లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక భారత్‌ నుంచి మరో టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ చేరుకున్న విషయం తెలిసిందే.

ఫైనల్లో స్వప్నిల్‌ కుసాలే
50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో భారత షూటర్‌ స్వప్నిల్‌ కుసాలే ఫైనల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్‌-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్‌ఈవెంట్‌కు అర్హత సాధించాడు.

ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించాడు.  

చదవండి: ‘పిస్టల్‌’తో పంట పండించాడు!

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)