Breaking News

Olympics: జ్యోతికి మళ్లీ నిరాశ.. సెమీస్‌ చేరకుండానే..

Published on Fri, 08/09/2024 - 10:29

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ రెపిచాజ్‌ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.

ఫలితంగా జ్యోతి సెమీస్‌ ఫైనల్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.

వెనుకంజలో గోల్ఫర్లు 
ప్యారిస్‌ ఒలింపిక్స్‌ గోల్ఫ్‌ మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్‌ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు.  

అంతిమ్‌పై నిషేధం.. ఖండించిన ఐఓఏ
భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల రెజ్లింగ్‌ 53 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అంతిమ్‌ తొలి రౌండ్‌ బౌట్‌లోనే టర్కీ రెజ్లర్‌ యెట్‌గిల్‌ జెనెప్‌ చేతిలో ఓడిపోయింది. 

ఆ తర్వాత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) 19 ఏళ్ల అంతిమ్‌పై కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్‌ కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే అంతిమ్‌పై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తలను గురువారం ఐఓఏ ఖండించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)