Breaking News

Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్‌

Published on Wed, 08/07/2024 - 12:01

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ తొలిసారిగా పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. రెజ్లింగ్‌ మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫొగట్‌  ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఆమె స్వర్ణం కోసం.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్‌తో తలపడనుంది. చాంప్‌-డి- మార్స్‌ ఎరీనాలో మ్యాట్‌- బి మీద ‘పసిడి పట్టు’ పట్టేందుకు సిద్దమైంది. 

రాత్రి 11.23 నిమిషాలకు ఈ బౌట్‌ మొదలుకానుంది. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇక వినేశ్‌తో పాటు మిగిలిన క్రీడాకారుల నేటి(ఆగష్టు 7) షెడ్యూల్‌ ఇదే!

రెజ్లింగ్‌ 
మహిళల ప్రీస్టయిల్‌ 53 కేజీలు: అంతిమ్‌ పంఘాల్‌ వర్సెస్‌ జైనెప్‌ యెట్గిల్‌ (మధ్యాహ్నం గం. 3:05 నుంచి) 
వెయిట్‌లిఫ్టింగ్‌ 
మహిళల 49 కేజీల (పతక పోరు): మీరాబాయి చాను (రాత్రి గం. 11:00 నుంచి)

అథ్లెటిక్స్‌ 
మిక్స్‌డ్‌ మారథాన్‌ వాక్‌: ప్రియాంక గోస్వామి, సూరజ్‌ పన్వర్‌ (ఉదయం గం. 11:00 నుంచి). 
పురుషుల హైజంప్‌ (క్వాలిఫికేషన్‌): సర్వేశ్‌ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి). 
మహిళల జావెలిన్‌ త్రో (క్వాలిఫికేషన్‌): అన్ను రాణి (మధ్యాహ్నం గం. 1:55 నుంచి). 
మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌: జ్యోతి యర్రాజీ (హీట్‌–4) (మధ్యాహ్నం గం. 2:09 నుంచి). 
పురుషుల ట్రిపుల్‌ జంప్‌ (క్వాలిఫికేషన్‌): ప్రవీణ్‌ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్‌ (రాత్రి గం.10:45 నుంచి). 
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ (అవినాశ్‌ సాబ్లే; అర్ధరాత్రి గం. 1:13 నుంచి).

భారత టీటీ జట్టు నిష్క్రమణ 
పారిస్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు కథ ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత్‌ 0–3తో చైనా చేతిలో ఓడింది.  తొలి మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌–మానవ్‌ ఠక్కర్‌ జోడీ 2–11, 3–11, 7–11తో మా లాంగ్‌–వాంగ్‌ జంట చేతిలో 0–1తో వెనుకబడింది.

రెండో మ్యాచ్‌లో ఐదోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఆచంట శరత్‌ కమల్‌ 11–9, 7–11, 7–11, 5–11తో ఫాన్‌ జెన్‌డాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ గెలిచి ఆశలు రేకెత్తించిన శరత్‌ అదే జోరు చివరి వరకు కొనసాగించ లేకపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌ రెండో పోరులో మానవ్‌ ఠక్కర్‌ 9–11, 6–11, 9–11తో వాంగ్‌ చేతిలో పరాజయం పాలవడంతో భారత ఓటమి ఖరారైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)