Breaking News

PAK vs SL: వన్డే ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన పాకిస్థాన్

Published on Tue, 10/10/2023 - 22:36

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్‌ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది.



అయితే 345 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక  బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్‌ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 
స్కో​ర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్‌ 345-4(48.2)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి