Breaking News

జొకోవిచ్‌ దూరం

Published on Wed, 11/06/2024 - 03:32

బెల్‌గ్రేడ్‌: పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్‌ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ మంగళవారం ప్రకటించాడు. 

‘ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు.  

ఏడుసార్లు విజేతగా... 
54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్‌ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.   

37 విజయాలతో ముగింపు... 
ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్‌ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్‌ వ్యక్తిగత సింగిల్స్‌ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్‌’లో అందుకున్నాడు.

వింబుల్డన్‌ టోర్నీలో, షాంఘై మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్‌ చేరుకున్నా రన్నరప్‌ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్‌ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు.  

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)