Breaking News

జొకోవిచ్‌ 100 నాటౌట్‌

Published on Sun, 05/25/2025 - 01:46

జెనీవా: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) వందో సింగిల్స్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. జెనీవా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా జొకో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఓపెన్‌ ఎరాలో 100 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. జిమ్మి కానర్స్‌ (109; అమెరికా), రోజర్‌ ఫెదరర్‌ (103; స్విట్జర్లాండ్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 5–7, 7–6 (7/2), 7–6 (7/2)తో హబర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)పై విజయం సాధించాడు. 

తొలి సెట్‌లో పరాజయం పాలైన జొకో... హోరాహోరీగా సాగిన మిగిలిన రెండు సెట్‌లను టై బ్రేకర్‌ ద్వారా గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హుర్కాజ్‌ 19 ఏస్‌లు సంధించగా... జొకోవిచ్‌ 6 ఏస్‌లకే పరిమితమైనా కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. హుర్కాజ్‌ 112 పాయింట్లు నెగ్గగా... జొకో 121 పాయింట్లు సాధించాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో 99వ టైటిల్‌ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్‌... ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందు ‘సెంచరీ’ పూర్తి చేసుకున్నాడు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అనంతరం జొకో... షాంఘై మాస్టర్స్, మియామి మాస్టర్స్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌కు చేరినా టైటిల్‌ గెలవలేకపోయాడు. ‘వందో టైటిల్‌ నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. హబర్ట్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ప్రయత్నించి సఫలమయ్యా’ అని జొకో అన్నాడు. 2006లో తొలి టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌... 19 ఏళ్ల కెరీర్‌లో మూడంకెల సంఖ్యకు చేరుకున్నాడు. 

ఈ క్రమంలో ఓపెన్‌ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో టైటిల్స్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్‌... నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరోసారి విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. మట్టి కోర్టులో జరగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సోమవారం మెకెంజీ మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)తో జొకోవిచ్‌ తలపడనున్నాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)