Breaking News

జొకోవిచ్‌ అలవోకగా...

Published on Fri, 05/31/2024 - 04:32

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వరుసగా 19వ ఏడాది మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 6–4, 6–1, 6–2తో రొబెర్టో కార్బెలస్‌ బేనా (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. 

2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ 43 విన్నర్స్‌ కొట్టడంతోపాటు నెట్‌ వద్ద 20 పాయింట్లు సాధించాడు. మరోవైపు నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), ఎనిమిదో సీడ్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్‌ 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై, హుర్కాజ్‌ 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో నకíÙమా (అమెరికా)పై గెలుపొందారు. కెచ్‌మనోవిచ్‌ (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్‌లో 5–0తో ఆధిక్యంలో ఉన్నపుడు కెచ్‌మనోవిచ్‌ గాయం కారణంగా వైదొలిగాడు. 
 
సబలెంకా ముందుకు... 
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సబలెంకా 6–2, 6–2తో ఉచిజిమా (జపాన్‌)పై, రిబాకినా 6–3, 6–4తో అరంటా రుస్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 7–6 (7/1), 1–6, 7–5తో నయోమి ఒసాకా (జపాన్‌)పై, మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–3, 6–4తో తమారా జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై నెగ్గారు. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)