Breaking News

జొకోవిచ్‌కు చుక్కెదురు

Published on Mon, 03/10/2025 - 04:17

కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు ఇండియన్‌ వెల్స్‌ ఏటీపీ–1000 మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ జొకోవిచ్‌... ఈ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్‌’ బొటిక్‌ వాన్‌ డి జాండ్‌షుల్ఫ్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్‌షుల్ప్‌ క్వాలిఫయింగ్‌ దశలోనే ఓడిపోయాడు. 

అయితే మెయిన్‌ ‘డ్రా’లో ఒక ప్లేయర్‌ వైదొలడగంతో క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్‌ జాండ్‌షుల్ప్‌కు ‘లక్కీ లూజర్‌’ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్‌లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్‌... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.

జాండ్‌షుల్ఫ్‌ బేస్‌లైన్‌తో పాటు నెట్‌ గేమ్‌తో అదరగొడితే... జొకో మ్యాచ్‌ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్‌గా జాండ్‌షుల్ఫ్‌ 4 ఏస్‌లు సంధించగా... జొకో ఒక్క ఏస్‌ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్‌ ప్లేయర్‌ 4 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా... జొకోవిచ్‌ 3 డబుల్‌ ఫాల్ట్‌లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.

మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్‌ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్‌... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్‌ సెమీఫైనల్‌ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్‌లోనే జొకో పరాజయం పాలయ్యాడు. 

మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్‌షుల్ఫ్‌ గతంలో... డేవిస్‌ కప్‌లో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై, యూఎస్‌ ఓపెన్‌లో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్‌పై గెలుపొందాడు. ఓవరాల్‌గా టాప్‌–10 ప్రత్యర్థులపై జాండ్‌షుల్ఫ్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్‌సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) కూడా రెండో రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)