Breaking News

జొకోవిచ్‌కు చుక్కెదురు

Published on Sat, 01/04/2025 - 04:22

బ్రిస్బేన్‌: కెరీర్‌లో 100వ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో కొత్త ఏడాదిలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు ఆశించిన ఫలితం రాలేదు. బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌  జొకోవిచ్‌ 6–7 (6/8), 3–6తో అమెరికాకు చెందిన 293వ ర్యాంకర్‌ రీలీ ఒపెల్కా చేతిలో ఓడిపోయాడు. 

2009లో ఒక్కసారి మాత్రమే ఈ టోర్నీలో ఆడి తొలి రౌండ్‌లో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి కూడా టోర్నీ కలిసి రాలేదు. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒపెల్కా ఏకంగా 16 ఏస్‌లు సంధించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒపెల్కా పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. 

రెండో సెట్‌లో ఒకసారి జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకున్న ఒపెల్కా తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 2022లో కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2023లో కేవలం ఒక టోర్నీలోనే ఆడాడు. గాయం నుంచి కోలుకుని 2024లో పలు టోర్నీల్లో ఆడినా ఒక్క టైటిల్‌ కూడా సాధించకపోవడంతో అతని ర్యాంక్‌ పడిపోయింది.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)