Breaking News

Novak Djokovic-Sania Mirza: ఇండియా అంటే నాకు చాలా ఇష్టం.. సానియాతో కలిసి పనిచేస్తా: జకోవిచ్‌

Published on Sun, 01/21/2024 - 14:10

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్ జ‌కోవిచ్ అదరగొడుతున్నాడు. జకోవిచ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జ‌రిగిన‌ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియ‌న్ మ‌న్నారినోను జ‌కో చిత్తుగా ఓడించాడు. . వ‌రుస సెట్లలో జోరు కొన‌సాగించిన ఈ సెర్బియా స్టార్ 6-0, 6-0, 6-3తో అల‌వోక‌గా గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్‌స్లామ్ క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా మూడో రౌండ్‌ అనంతరం సోనీ స్పోర్ట్స్‌కు జకోవిచ్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా కూడా పాల్గోంది. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని, అక్కడ టెన్నిస్‌ అభివృద్దికి  సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జ‌కోవిచ్ తెలిపాడు.

"భారత్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. సెర్బియా, భారతదేశ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు భారతీయలు అంటే చాలా ఇష్టం.  వారు ఎల్లప్పుడూ నన్ను అభిమానుస్తునే ఉంటారు. భారతీయలకు ప్రేమభిమానాలు ఎక్కువ. ఇండియన్స్‌ క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్‌ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తారు.

నేను దాదాపు పదేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు అక్కడే ఉన్నాను. మళ్లీ ఇండియాకు రావాలనుకుంటున్నాను. భారత్‌లో  పిల్లల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం.

అదే మా ఫౌండేషన్ లక్ష్యం కూడా. అదే విధంగా భారత్‌లో టెన్నిస్‌ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనకుంటున్నను. ఎక్కువ మంది పిల్లలు టెన్నిస్ రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్‌ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్‌ కోసం మనమిద్దరం కలిసి పనిచేద్దాం" అని సానియా మీర్జాతో జకోవిచ్‌ పేర్కొన్నాడు.
చదవండి: #ShoaibMalikSaniamirza: 'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)