Breaking News

ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్‌మెడల్‌.. కన్నీటి పర్యంతమైన జొకోవిచ్‌

Published on Mon, 08/05/2024 - 11:59

కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్, 7 ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్స్, ఎనిమిది సార్లు నంబర్‌వన్‌గా ఏడాది ముగింపు, 2 సార్లు కెరీర్‌ గోల్డెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్, డేవిస్‌కప్‌ విజేత, 428 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌... టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ అత్యద్భుత ఆటతో సాధించిన అసాధారణ ఘనతలివి. 

అయితే ఇన్ని గొప్ప విజయాల తర్వాత కూడా జొకోవిచ్‌ కెరీర్‌లో ఒలింపిక్స్‌ స్వర్ణ పతకం ఒకటి ఇప్పటి వరకు లోటుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు జొకో దానిని కూడా సాధించి తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జొకోవిచ్‌ పసిడి పతకం కోసం ఎంతో తపించాడు.

దాని కోసం పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ కల నెరవేరింది. ‘కెరీర్‌ గోల్డెన్‌స్లామ్‌’ నెగ్గిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో అతను తన పేరును లిఖించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకో 7–6 (7/3), 7–6 (7/2) స్కోరుతో కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు.

ఇటీవలే వింబుల్డన్‌ ఫైనల్లో తనను ఓడించి ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అల్‌కరాజ్‌పై తన అనుభవాన్నంతా ఉపయోగించి టైబ్రేక్‌లో సెర్బియా స్టార్‌ పైచేయి సాధించాడు.  37 ఏళ్ల జొకో అతి పెద్ద వయసులో ఒలింపిక్‌ టెన్నిస్‌లో స్వర్ణం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

భావోద్వేగానికి లోనైన జొకోవిచ్‌
ఇక గోల్డ్ మెడల్ విజయం తర్వాత జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సెర్బియా జాతీయ పతాకంతో తన కుటుంబసభ్యులు, టీమ్‌ వద్దకు పరుగెత్తిన జొకోవిచ్‌ కన్నీళ్లపర్యంతమయ్యాడు. 

తన కొడుకు, కూతురును కౌగిలించుకొని అతను ఏడ్చేసిన తీరు అతని దృష్టిలో ఈ పతకం విలువేమిటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)