Breaking News

అల్‌కరాజ్‌ గెలుపు కాదు.. ఫెదరర్‌ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్‌

Published on Mon, 07/17/2023 - 15:42

Wimbledon 2023: నిన్న జరిగిన వింబుల్డన్‌-2023 ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌.. స్పానిష్‌ యువకెరటం కార్లోస్‌ అల్‌కరాజ్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ రసవత్తర సమరంలో అల్‌కరాజ్‌ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్‌పై నెగ్గాడు. తద్వారా అల్‌కరాజ్‌ తొలి వింబుల్డన్‌ టైటిల్‌ను, ఓవరాల్‌గా రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, భావోద్వేగాలను బ్యాలెన్స్‌ చేయలేక తరుచూ సహనం కోల్పోయే జకోవిచ్‌.. తనలో ఎప్పుడూ బయటపడని కొత్త యాంగిల్‌ను వింబుల్డన్‌ 2023 ఫైనల్‌ అనంతరం చూపించాడు. ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా తనపై గెలిచిన అల్‌కరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తిన జకో.. చాలా సేపు ఆహ్లాదంగా మాట్లాడి, ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే.. తాను 2019లో ఫెదరర్‌పై గెలవాల్సింది కాదని జకో అన్నాడు. అల్‌కరాజ్‌ చేతిలో ఓటమిని మైదానంలోని కొందరు ప్రేక్షకులు ఫెదరర్‌ ప్రతీకారమని అరవడమే జకో కనీళ్లకు కారణమని తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే, సెంటర్‌ కోర్టులో జకోవిచ్‌కు పదేళ్ల తర్వాత ఎదురైన తొలి పరాజయం ఇదే. జులై 7, 2013లో ఆండీ ముర్రే చివరిసారిగా సెంటర్‌ కోర్టులో జకోవిచ్‌పై గెలిచాడు. ఆతర్వాత ఇన్నాళ్లకు అల్‌కరాజ్‌.. సెంటర్‌ కోర్టులో జకోవిచ్‌పై నెగ్గాడు. మరోవైపు తొలి సెట్‌ గెలిచి గ్రాండ్‌స్లామ్‌ ఓడిపోయిన తొలి మ్యాచ్‌ కూడా ఇదే కావడం విశేషం. 78 మ్యాచ్‌ల తర్వాత జకోవిచ్‌.. తొలి సెట్‌ గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిపోయాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)