Breaking News

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్‌

Published on Fri, 04/11/2025 - 11:44

రచ్చ గెలుస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదు
ఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్‌ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్‌ చేసేందుకు అనుకూలమైన పిచ్‌. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయాం.

మా జట్టులోని ప్రతి బ్యాటర్‌ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.

మా బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.

మా ఓటమికి కారణం అదే
ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌ పవర్‌ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.

వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్‌ పాటిదార్‌ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (17 బంతుల్లో 37), విరాట్‌ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (1) విఫలమయ్యాడు.

రజత్‌ పాటిదార్‌ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (4), జితేశ​ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్‌ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.

పవర్‌ ప్లేలో మూడు వికెట్లు.. కానీ
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2)ను యశ్‌ దయాళ్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌(7)ను భువనేశ్వర్‌ కుమార్‌ వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

రాహుల్‌ రఫ్పాడించాడు
అయితే, కేఎల్‌ రాహుల్‌ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్‌ బ్యాటర్‌.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 38 నాటౌట్‌) రాణించాడు.  

ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్‌ సేనకు ఈ సీజన్‌లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలవగలిగింది.

ఐపీఎల్‌-2025: బెంగళూరు వర్సెస్‌ ఢిల్లీ
👉టాస్‌: ఢిల్లీ.. మొదట బౌలింగ్‌
👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)
👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)
👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.

చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్‌?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)