Breaking News

వరల్డ్‌ నంబర్‌ వన్‌ను ఓడించిన గుకేష్‌.. నిరాశతో టేబుల్‌ను కొట్టిన కార్ల్‌సన్‌

Published on Mon, 06/02/2025 - 09:16

నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో వ‌ర‌ల్డ్ నెం1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఖంగుతిన్పించాడు. ఆదివారం ఆర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఈ టోర్నీ ఆరో రౌండ్‌లో కార్ల్సెన్‌ను గుకేష్ ఓడించాడు. ఆఖ‌రివ‌ర‌కు నువ్వానేనా అన్న‌ట్లు సాగిన ఈ గేమ్‌లో గుకేష్ పై చేయి సాధించాడు.

ఈ గేమ్‌లో మ‌ధ్య‌వ‌ర‌కు కార్ల్‌సెన్ ఆధిప‌త్యం చెలాయించాడు. కానీ ఎండ్‌గేమ్ సమయానికి 34 ఏళ్ల కార్ల్సెన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. కాగా క్లాసికల్‌ చెస్‌ పోటీలో కార్ల్‌సన్‌ను ఓడించడం గుకేశ్‌కు ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గుకేష్ మూడు విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.

త‌ద్వారా ఈ టోర్నీ పాయింట్ల ప‌ట్టిక‌లో గుకేష్ రెండో స్ధానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతని స్కోరు 8.5 పాయింట్లు కాగా, రెండో స్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాకు కేవలం ఒక పాయింట్ తక్కువగానే ఉన్నాడు. 

ఓ మై గాడ్‌.. !
ఇక యువ గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓట‌మిని ప్రపంచ చెస్ దిగ్గ‌జం కార్ల్‌సెన్ త‌ట్టుకోలేక‌పోయాడు. తీవ్ర అసహనానికి గురైన మాగ్నస్‌.. ఓ మై గాడ్ అంటూ పిడికిలితో ఒక్కసారిగా చెస్‌బోర్డు టేబుల్‌ను బలంగా పంచ్ చేశాడు. అనంతరం గుకేశ్‌కు రెండు సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేవిధంగా వరల్డ్ నెంబర్ 1 ఆటగాడిని ఓడించిన గుకేష్‌.. కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.


 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)