Breaking News

అయ్యో దక్షిణాఫ్రికా.. ఊహించిందే జరిగింది! ఇక కష్టమే మరి

Published on Thu, 09/21/2023 - 12:57

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్‌ పేసర్లు అన్రిచ్‌ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్‌ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్‌ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ భర్తీ చేసింది.

ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్‌, సిసిందా ఇద్దరూ వరల్డ్‌కప్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్‌ ఎల్లప్పడూ ఉంటుంది.

వీరి స్ధానంలో  ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్‌ బాల్‌ సిరీస్‌లలో ప్రోటీస్‌కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్‌ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో  రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు.  ఇక వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: ODI World Cup: పిచ్‌ క్యూరేటర్‌లకు ఐసీసీ కీలక ఆదేశాలు..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)