Breaking News

శెభాష్‌ నిషా.. ఓడినా పర్లేదు! నువ్వొక వారియర్‌

Published on Tue, 08/06/2024 - 13:20

ప్యారిస్ ఒలింపిక్స్ 68 కేజీల విభాగం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ నిషా దహియా, ఉత్త‌ర కొరియా రెజ్ల‌ర్ పాక్‌ సోల్‌ గుమ్ త‌ల‌ప‌డ్డారు. గేమ్ ఆరంభం నుంచే ప్ర‌త్య‌ర్ధిపై నిషా దహియా ఆధిపత్యం చెలాయించింది. ఆట మ‌రో  90 సెకన్లలో ముగియనుంది. అప్పటికే 8-1 స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నిషా దహియా.. విజయం ఖాయమనే అంతా భావించారు. సరిగ్గా అదే సమయంలో ఆమెను దురదృష్టం వెంటాడింది. 

అనూహ్యంగా దహియా కుడి చేతి వేలికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిపోయింది. తక్షణమే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఓ వైపు గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌ట‌కి.. ప‌త‌కం సాధించాల‌న్న క‌సితో ద‌హియా పోరాడింది. కానీ గాయం త‌ర్వాత‌ ప్ర‌త్య‌ర్ధికి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది.

ఈ క్రమంలో ప్రత్యర్ధి పుంజుకుని వ‌రుస‌గా 9 పాయింట్లు సాధించి  10-8తేడాతో నిషాను ఓడించింది. దీంతో ఒక్క‌సారిగా నిషా దహియా క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. అయితే ద‌హియా ఓట‌మి పాలైనప్ప‌ట‌కి.. త‌న పట్టుదలతో అంద‌ర‌ని మ‌న‌సుల‌ను గెలుచుకుంది. 

ఆమె పోరాట ప‌టిమ‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కాగా నిషా దహియా ఓట‌మిపై భార‌త రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర దహియా  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ప్రత్యర్థి సోల్ గమ్ పాక్ ఉద్దేశ్యపూర్వకంగానే నిషా దహియాను గాయపరిచిందని వీరేంద్ర దహియా పేర్కొన్నాడు.

"100కు 100 శాతం ఉద్దేశపూర్వకంగా ఆమె నిషాను గాయ‌ప‌రిచింది. ఆమెను కావాల‌నే గాయప‌ర‌చ‌డం అంద‌రూ చూశారు. ఆమెకు కొరియన్‌ డగౌట్‌ నుంచి అలా చేయాల‌నే సూచనలు వ‌చ్చాయి. అందుకే సోల్‌ గుమ్ నిషాను ఎటాక్ చేసింది. నిషా నుంచి పతకాన్ని దొచేశారుని" పీటీఐతో వీరేంద్ర దహియా చెప్పుకొచ్చాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)