Breaking News

గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ దూరం!

Published on Tue, 05/16/2023 - 10:26

ఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. దీం‍తో ప్లే ఆఫ్స్‌లోకి హార్దిక్‌ సేన అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుబ్‌మన్‌ గిల్‌  సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ ఫైవ్‌ వికెట్ల హాల్‌ సాధించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌.. 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, మొహిత్‌ శర్మ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.

నూర్‌ అహ్మద్‌కు గాయం..
ఇక ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో బంతి నూర్‌ ఆహ్మద్‌
యాంకిల్‌ (చీలమండ)కు బలంగా తాకింది.

దీంతో వెంటనే అతడు మైదానంలో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడి బౌలింగ్‌ కోటా తెవాటియా పూర్తి చేశాడు. కాగా నూర్‌ అహ్మద్‌ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

చదవండి: Aiden Markram: ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. టోర్నీ నుంచి ఇలా నిరాశగా! అతడు మాత్రం అద్భుతం..

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)