ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్‌పై వేటు

Published on Tue, 11/19/2024 - 11:12

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వ‌న్డేల సిరీస్‌కు 16 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సార‌థ్యం వ‌హించ‌నుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్య‌వ‌హ‌రించ‌నుంది.

అయితే ఈ జ‌ట్టులో భార‌త స్టార్ ఓపెన‌ర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జ‌ట్టు ఎంపికకు ష‌ఫాలీని సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. అయితే ఆమెను ప‌క్క‌న పెట్ట‌డానికి గల కార‌ణాన్ని అయితే సెల‌క్ట‌ర్లు వెల్ల‌డించ‌లేదు. షెఫాలీ మాత్రం ప్ర‌స్తుతం పెద్ద‌గా ఫామ్‌లో లేదు.

ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షఫాలీ వర్మ  కేవలం 56 పరుగులు మాత్ర‌మే చేసింది. ఆమె వ‌న్డేల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి ఏడాది దాటింది. మ‌రోవైపు హర్లీన్ డియాల్‌, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున  2023లో ఆడింది. అప్ప‌టి నుంచి జ‌ట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబ‌ర్ 5న‌ బ్రిస్బేన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీప‌ర్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)