Breaking News

టీమిండియా కోచ్‌గా తమ్ముడు.. అన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 08/19/2024 - 16:58

బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంగా టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ మోర్నీ మోర్కెల్‌ ప్రయాణం మొదలుకానుంది. ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ సహాయక బృందంలోని ర్యాన్‌ టెన్‌ డస్కటే, అభిషేక్‌ నాయర్‌లతో అతడు కూడా చేరనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో భాగంగా జరుగనున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ భారత జట్టుకు కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో మోర్నీ మోర్కెల్‌ అన్నయ్య, మాజీ క్రికెటర్‌ ఆల్బీ మోర్కెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచింగ్‌ సిబ్బందిలో భాగమయ్యే అవకాశం రావడం అరుదని.. ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగిపోతుందని అన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.

ఈ మేరకు ఆల్బీ మోర్కెల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సుదీర్ఘ కాలంగా విజయవంతమైన జట్టుగా భారత్‌ కొనసాగుతోంది. అలాంటి చోట పొరపాట్లకు తావుండదు. ఇక ఆ జట్టులో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.

ముందుగా వారందరి నమ్మకం చూరగొనడం మోర్నీకి అత్యంత ముఖ్యమైనది. తమ నైపుణ్యాలకు మరింత మెరుగులుదిద్దుకునేలా మోర్నీ సహకరిస్తాడని వారు విశ్వసించాలి. అప్పుడే చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ బౌలర్‌గా మోర్నీకి ఎంతో అనుభవం ఉంది.

అతడి మార్గదర్శనంలో టీమిండియా బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. మోర్నీ గనుక తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే.. భారత జట్టుకు తప్పక మేలు చేకూరుతుంది’’ అని పేర్కొన్నాడు. మిడ్‌ డే తో మాట్లాడుతూ ఆల్బీ మోర్కెల్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మోర్నీ మోర్కెల్‌కు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది.

ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున గంభీర్‌ సారథ్యంలో ఆడాడు మోర్నీ. అనంతరం... లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్‌ పనిచేసిన సమయంలో అతడు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడిన మోర్నీ మోర్కెల్‌.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్‌ పలు జట్లకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)