Breaking News

ఆసీస్‌ జట్టులో ఊహించని మార్పులు.. నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ

Published on Tue, 12/23/2025 - 09:42

యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఆసీస్ జట్టులో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. 

అతడి స్దానంలో తిరిగి వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్టుకు ఆఖరి నిమిషంలో దూరమైన స్మిత్‌.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక కమ్మిన్స్‌తో పాటు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు.

అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లియోన్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ  జట్టులోకి వచ్చాడు. మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మర్ఫీ వైపే మొగ్గు చూపారు. 

ఈ విక్టోరియన్ ఆఫ్ స్పిన్నర్ గతంలో లియోన్ గైర్హాజరీలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక కమ్మిన్స్ స్ధానంలో జే రిచర్డ్‌సన్‌కు చోటు దక్కింది. ఈ వెస్ట్ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ చివ‌ర‌గా ఆసీస్ త‌ర‌పున టెస్టు మ్యాచ్ 2021లో ఆడాడు. ఇప్పుడు మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత అత‌డి రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. కాగా తొలి మూడు టెస్టుల్లో విజ‌యం సాధించిన ఆసీస్‌.. యాషెస్ సిరీస్‌ను ఇప్ప‌టికే 3-0 తేడాతో సొంతం చేసుకుంది.

బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్‌ జట్టు ఇదే..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ ల‌బుషేన్‌, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేజర్, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)