Breaking News

నితీశ్ రెడ్డి హ్యాట్రిక్‌.. అయినా త‌ప్ప‌ని ఓట‌మి

Published on Fri, 12/12/2025 - 13:58

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద‌ర‌గొట్టాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్‌.. శుక్రవారం మధ్యప్రదేశ్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపాడు.

తొలుత బ్యాటింగ్‌లో 25 ప‌రుగులతో స‌త్తాచాటిన నితీశ్‌.. అనంత‌రం బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 19.1 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో శ్రీకర్‌ భరత్‌(39), నితీశ్‌ రెడ్డి(25) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో శివమ్‌ శుక్లా నాలుగు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్‌ మూడు, రాహుల్‌ బాథమ్‌ రెండు వికెట్లు సాధించారు.

నితీశ్‌ హ్రాట్రిక్‌ షో..
113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌కు నితీశ్‌ ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. మూడో ఓవర్‌ వేసిన నితీశ్‌ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఎంపీని కష్టాల్లో​కి నెట్టాడు. నితీష్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా హర్ష్ గవాలి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత డెలివరీకి హర్‌ప్రీత్ సింగ్ రిక్కీ భుయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇక చివరగా నితీశ్‌ ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రిషబ్‌ చౌహన్‌(47), రాహుల్‌ బాథమ్‌(35 నాటౌట్‌) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆంధ్రపై 4 వికెట్ల తేడాతో ఎంపీ ఘన విజయం సాధించింది.
చదవండి: Asia Cup: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)