Breaking News

రాణించిన నిత్య

Published on Mon, 08/11/2025 - 04:08

భువనేశ్వర్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ బ్రాంజ్‌ లెవెల్‌ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి నిత్య గంధె ఆకట్టుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన నిత్య... 200 మీటర్ల విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 100 మీటర్ల ఫైనల్‌ రేసును నిత్య 11.70 సెకన్లలో ముగించింది. అభినయ (భారత్‌) 11.57 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా... స్నేహ (భారత్‌) 11.70 సెకన్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. 

నిత్య, స్నేహ ఒకే సమయం నమోదు చేసినా ఫొటో ఫినిష్‌ ద్వారా స్నేహకు రెండో స్థానాన్ని ఖరారు చేశారు. 200 మీటర్ల ఫైనల్‌ రేసును నిత్య 24.11 సెకన్లలో పూర్తి చేసింది. ఏంజెల్‌ సిల్వియా (భారత్‌; 23.95 సెకన్లు) తొలి స్థానంలో, ఉన్నతి అయ్యప్ప (భారత్‌) 24.56 సెకన్లు మూడో స్థానంలో నిలిచారు. కాంటినెంటల్‌ టూర్‌ మీట్‌లలో విజేతలకు పతకాలకు బదులుగా ప్రైజ్‌మనీ చెక్‌లు అందజేశారు. 

తొలి స్థానం పొందిన వారికి 800 డాలర్లు (రూ. 70 వేలు), రెండో స్థానం దక్కించుకున్న వారికి 400 డాలర్లు (రూ. 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 300 డాలర్లు (రూ. 26 వేలు), నాలుగో స్థానం సంపాదించిన వారికి 200 డాలర్ల (రూ.17 వేలు) చొప్పున ప్రదానం చేశారు. 

పురుషుల 200 మీటర్లలో అనికుశ్‌ కుజుర్‌ (భారత్‌; 20.77 సెకన్లు)... లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ (భారత్‌; 8.13 మీటర్లు), ట్రిపుల్‌ జంప్‌లో అబుబాకర్‌ (భారత్‌; 16.53 మీటర్లు).. మహిళల జావెలిన్‌ త్రోలో అన్ను రాణి (భారత్‌; 62.01 మీటర్లు)... లాంగ్‌జంప్‌లో శైలి సింగ్‌ (భారత్‌; 6.28 మీటర్లు) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)