Breaking News

సెమీస్‌లో పోరాడి ఓడిన దీపక్‌, నిశాంత్‌.. కాంస్యాలతో ముగింపు

Published on Sat, 05/13/2023 - 13:51

తాషెకంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ మూడు కాంస్య పతకాలతో ముగించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. శుక్రవారం జరిగిన మూడు సెమీఫైనల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. హరియాణాకు చెందిన దీపక్‌ భోరియా (51 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) తమ శక్తినంతా ధారపోసి పోరాడినా ఫలితం లేకపోగా... మోకాలి గాయం కారణంగా తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) జట్టు వైద్య బృందం సలహా మేరకు రింగ్‌లోకి దిగకుండానే ప్రత్యర్దికి ‘వాకోవర్‌’ ఇచ్చాడు.

గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన ఫ్రాన్స్‌ బాక్సర్‌ బిలాల్‌ బెనామాతో జరిగిన సెమీఫైనల్లో దీపక్‌ 3–4తో ఓడిపోయాడు. మూడు రౌండ్లలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దీపక్‌ పంచ్‌ల ధాటికి ఒకసారి రిఫరీ బెనామాకు కౌంట్‌బ్యాక్‌ ఇచ్చారు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో నిర్ణీత మూడు రౌండ్ల తర్వాత రిఫరీలు బౌట్‌ను సమీక్షించి చివరకు బెనామా పైచేయి సాధించినట్లు తేల్చారు.

ఆసియా చాంపియన్‌ అస్లాన్‌బెక్‌ షిమ్‌బెర్జనోవ్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన సెమీఫైనల్లో నిశాంత్‌ దేవ్‌ 2–5తో ఓటమి చవిచూశాడు. అస్లాన్‌బెక్‌పై నిశాంత్‌ లెఫ్ట్, రైట్‌ క్రాస్‌ పంచ్‌లతో విరుచుకుపడినా వీటిలో కచ్చితత్వం లేకపోవడంతో చివరకు కజకిస్తాన్‌ బాక్సర్‌దే పైచేయి అయింది. సైడెల్‌ హోర్టా (క్యూబా)తో తలపడాల్సిన నిజామాబాద్‌ బాక్సర్‌ హుసాముద్దీన్‌ మోకాలి గాయం కారణంగా బరిలోకి దిగలేకపోయాడు.

దియాజ్‌ ఇబనెజ్‌ (బల్గేరియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో హుసాముద్దీన్‌ మోకాలికి గాయమైంది. త్వరలోనే ఆసియా క్రీడలు ఉండటం... ఈ క్రీడలు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత టోరీ్నగా కూడా ఉండటంతో భారత బాక్సింగ్‌ వైద్య బృందం హుసాముద్దీన్‌ గాయం తీవ్రత పెరగకూడదనే ఉద్దేశంతో బరిలో దిగవద్దని సలహా ఇచి్చంది. దాంతో హుసాముద్దీన్‌ రింగ్‌లోకి దిగలేదు.  

ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 10. అమిత్‌ పంఘాల్‌ (2019) రజతం సాధించాడు. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధూరి (2017), మనీశ్‌ కౌశిక్‌ (2019), ఆకాశ్‌ కుమార్‌ (2021), హుసాముద్దీన్, దీపక్, నిశాంత్‌ దేవ్‌ (2023) కాంస్య పతకాలు గెలిచారు.    

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)