Breaking News

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నేమార్‌కు ఊహించని షాక్‌! మిలియన్‌ డాలర్‌ ఫైన్‌

Published on Fri, 06/23/2023 - 13:08

Neymar Could Be Fined $1 Million: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నేమార్‌కు భారీ షాక్‌ తగిలింది. దేశంలోని ప్రధాన పట్టణం రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్‌ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు.

పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనం నిర్మిస్తున్న నేమార్‌కు మిలియన్‌ డాలర్‌ మేర ఫైన్‌ వేయనున్నారు. ఈ విషయం గురించి స్థానిక మేయర్‌ కార్యాలయం.. ‘‘సోషల్‌ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం.

భవనం నిర్మిస్తున్న క్రమంలో అతడు పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేకూర్చాడు. కాబట్టి మిలియన్‌ డాలర్ల మేర జరిమానా విధించే అవకాశం ఉంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. నేమార్‌ చేపట్టిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిపింది.

రెండున్నర ఎకరాలు
కాగా నేమార్‌ మాన్షన్‌ వద్దకు వచ్చి అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని చెప్పగా.. అతడి తండ్రి వారితో గొడవతో దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. 2016లో నేమార్‌ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.

ఇక్కడ హెలిప్యాడ్‌, స్పా, జిమ్‌ తదితర సౌకర్యాలతో మాన్షన్‌ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్‌ సెయింట్‌- జర్మేన్‌(పీఎస్‌జీ) ఫుట్‌బాలర్‌ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్‌ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది.

చదవండి: 'మెక్‌కల్లమ్‌ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)