Breaking News

Neymar: శుభవార్త చెప్పిన నేమార్‌.. ఫొటోలు వైరల్‌

Published on Wed, 04/19/2023 - 14:28

Neymar and Bruna Biancardi: బ్రెజిలియన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌, పారిస్‌ సెయింట్‌- జర్మేన్‌(పీఎస్‌జీ) ప్లేయర్‌ నేమార్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘నీ రాక కోసం మేము కలగన్నాం. 

ఎన్నెన్నో ప్రణాళికలు రచించాం. నీ రాక మా జీవితాలను పరిపూర్ణం చేయడంతో పాటు రానున్న రోజులను మరింత సంతోషకరంగా మారుస్తుందని మాకు తెలుసు. నువ్వొక అందమైన కుటుంబంలో అడుగుపెట్టబోతున్నావు. 

తోబుట్టువులు, బామ్మ-తాతయ్యలు, అత్తమ్మలు, పిన్నమ్మలు ఇప్పటికే నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు’’ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంది. పుట్టబోయేది కూతురైనా, కొడుకైనా తమ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని.. తన గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను తొందరగా చూడాలని ఉందంటూ ఉద్వేగానికి లోనైంది.

కాగా ఈ ఫొటోల్లో నేమార్‌ తన భాగస్వామి బ్రూనాను, పుట్టబోయే బిడ్డను ముద్దాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో నేమార్‌ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలో నేమార్‌- డావీ లుకాతో కలిసి 2011లో కూతురికి జన్మనిచ్చాడు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఈ బ్రెజిలియన్‌ స్టార్‌కు రెండో సంతానం.

ఇదిలా ఉంటే.. 2021 నుంచి డేటింగ్‌ చేస్తున్న నేమార్‌- బ్రూనా 2022లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడు నెలల తర్వాత విడిపోతున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా ఇలా తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు.

కాగా ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాలన్న 30 ఏళ్ల నేమార్‌ కల ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)