Breaking News

మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Published on Sun, 03/16/2025 - 10:36

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఘోర ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తోంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ ఘోర ఓటమితో ప్రారంభించింది.

ఆదివారం క్రైస్ట్ చర్చ్‌​ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాకిస్తాన్ వికెట్ల పతనం మొదలైంది. కివీస్ బౌల‌ర్ల‌లో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ ప‌త‌నాన్ని శాసించ‌గా.. కైల్ జేమిస‌న్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో కుష్దిల్ షా(32) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

సీఫర్ట్ విధ్వంసం..
అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలో ఊదిపడేసింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్‌(29),రాబిన్‌సన్‌(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టాడు.

టీమ్ మారినా..
ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌కు దాదాపుగా కొత్త టీమ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్టర్లు ఎంపిక చేశారు.  కెప్టెన్‌​ మహ్మద్ రిజ్వాన్‌, బాబర్ ఆజం, సౌద్ షకీల్ వంటి స్టార్ ఆటగాళ్లపై పీసీబీ వేటు వేసింది. వారి స్ధానంలో హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.

కానీ వీరివ్వరూ కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చకోలేకపోయారు. దీంతో పాకిస్తాన్‌​ సెలకర్టపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తుంది. బాబర్‌, రిజ్వాన్‌ను త​‍ప్పించాల్సిన అవసరం ఏముంది అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
చదవండి: WPL 2025: ఫైన‌ల్లో ఓట‌మి.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ ప్లేయ‌ర్‌! వీడియో వైర‌ల్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)