Breaking News

బాస్కెట్‌బాల్‌ చ‌రిత్రలో సంచ‌ల‌నం.. 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

Published on Sun, 06/14/2026 - 19:50

బాస్కెట్‌బాల్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. న్యూయార్క్ నిక్స్‌ 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ చాంపియ‌న్‌షిప్ (ఎన్‌బీఏ) చాంపియ‌న్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్‌బీఏ చ‌రిత్ర‌లో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెల‌వ‌డం ఇది మూడోసారి. 

శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఫైన‌ల్లో న్యూయార్క్ నిక్స్ 94-90 తేడాతో సాన్ ఆంటోనియో జ‌ట్టుపై విజ‌యం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో మొద‌ట సాన్‌ ఆంటోనియో ఆదిపత్యం చెలాయించ‌గా, న్యూయార్క్ నిక్స్ ఆఖ‌ర్లో అద్భుతంగా ఫుంజుకోవ‌డం విశేషం. 

చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచిన నిక్స్ జట్టు, మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను ముద్దాడటంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. పటిష్టమైన సాన్ ఆంటోనియో జట్టుపై మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూయార్క్ నిక్స్, ఫైనల్ సిరీస్‌లో తిరుగులేని ఆటతీరుతో చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అభిమానుల ఓవ‌రాక్ష‌న్‌..


న్యూయార్క్ నిక్స్ గెలుపుతో అమెరికాలోని న్యూయార్క్ వీధులు జ‌న‌సంద్రంగా మారిపోయింది. న్యూయార్క్ నిక్స్ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంతో న్యూయార్క్‌లోని ప్ర‌ఖ్యాత టైమ్‌స్క్వేర్ వ‌ద్ద వేల సంఖ్య‌లో గూమిగూడిన జ‌నం సంబ‌రాల్లో మునిగితేలారు. అయితే ఈ వేడుక‌లు శ్రుతి మించాయి. కొంద‌రు అభిమానులు బ‌స్సుల‌కు మంట‌లు పెట్టి సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో అల్ల‌ర్లు చెల‌రేగాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు టైమ్‌స్క్వేర్ వ‌ద్ద జ‌నాల‌ను చెద‌ర‌గొట్టేందుకు  లాఠీచార్జీ చేశారు. దీంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్‌.. 71 ఏళ్లుగా చెక్కుచెద‌ర‌ని రికార్డు!

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు