Breaking News

సూర్యకుమార్‌ యాదవ్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ క్యాచ్‌... వివాదాస్పదం

Published on Mon, 07/01/2024 - 09:22

టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన  సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్‌ మ్యాన్‌లా క్యాచ్‌ పట్టాడని అభిమానులు కొనియాడారు.

అయితే స్కై పట్టిన ఈ క్యాచ్‌ క్యాచ్‌ కాదు సిక్సర్‌ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్‌ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్‌ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్‌ చేస్తున్నారు.

బంతి  చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్‌ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్‌ అంపైర్‌ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌ గెలిచేదని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. 

కాగా, 2024 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించింది. సూర్యకుమార్‌ క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్‌ తొలి బంతికే మిల్లర్‌ ఔటయ్యాడు. మిల్లర్‌ ఔట్‌ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి.

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)