Breaking News

సెన్సేషనల్ సుద‌ర్శ‌న్‌.. ఆరు మ్యాచ్‌ల‌లో 4 హాఫ్ సెంచ‌రీలు

Published on Sat, 04/12/2025 - 18:09

ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ ఓపెన‌ర్‌, టీమిండియా యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో నిల‌క‌డ‌కు మారు పేరుగా మారిన సుద‌ర్శ‌న్.. మ‌రోసారి త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి గుజ‌రాత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని సుద‌ర్శ‌న్ అందించాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న సాయి సుద‌ర్శ‌న్‌.. 7 ఫోర్లు 1 సిక్స్‌తో 56 ప‌రుగులు చేశాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో సుద‌ర్శ‌న్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం.

74, 63, 49, 5, 82, 56 వ‌రుస‌గా సుద‌ర్శ‌న్ సాధించిన స్కోర్లు ఇవి. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచ్‌లు ఆడిన సుద‌ర్శ‌న్‌.. 54.83 స‌గ‌టుతో 329 ప‌రుగులు చేసి లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఈ  క్ర‌మంలో సుద‌ర్శ‌న్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సూప‌ర్ స్టార్ సుద‌ర్శ‌న్ అంటూ కొనియాడుతున్నారు.

కాగా సాయి సుదర్శన్ ఇప్పటికే టీమిండియా తరపున వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. ఆడిన 3 వన్డేల్లో 63.50 సగటుతో సుదర్శన్ 127 ప‌రుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత అత‌డికి అనూహ్యంగా జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో నిలకడగా సత్తాచాటి మళ్లీ టీమిండియాలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నాడు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)