Breaking News

ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత

Published on Thu, 07/06/2023 - 20:50

అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో డచ్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్‌ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు.

దీంతో క్వాలిఫయర్‌-2 హోదాలో నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్‌-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్‌ జట్టు క్వాలిఫయర్‌-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. భారత్‌ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్‌ రిచీ బెరింగ్‌టన్‌ 64, థామస్‌ మెకింటోష్‌ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్‌ క్లీన్‌ రెండు, వాన్‌బీక్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

 అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ బాస్‌ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్‌ జుల్పికర్‌ 33 నాటౌట్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌలిగ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్‌ డీ లీడేను 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'  అవార్డు వరించింది.

చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ

#MarkWood: యాషెస్‌ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్‌ బంతి.. ఖవాజాకు మైండ్‌ బ్లాక్‌

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు