Breaking News

WC 2023: జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్‌.. ‘ఆంధ్ర అబ్బాయి’కి చోటు! కెప్టెన్‌గా

Published on Thu, 09/07/2023 - 15:36

Netherlands 15-member squad for 2023 World Cup: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది. అదే విధంగా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను కూడా ఎంపిక చేసినట్లు తెలిపింది.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ డచ్‌ జట్టును ముందుండి నడిపించనుండగా.. తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని  విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన అనిల్‌ తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

అనూహ్యరీతిలో స్కాట్లాండ్‌పై నెగ్గి
ఇక జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అసాధారాణ పోరాటం కనబరిచింది. తమ చివరి మ్యాచ్‌లో అనూహ్యరీతిలో స్కాట్లాండ్‌పై నెగ్గింది.

భారత్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టాలంటే నాటి మ్యాచ్‌లో 44 ఓవర్లలో లక్ష్యం 278 పరుగులుగా ఉన్న సమయంలో... బాస్‌ డి లీడె అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి శతకానికి తోడు జుల్ఫికర్‌ అండగా నిలవడంతో నెదర్లాండ్స్‌ మరో 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది.

తేజ అద్భుత సెంచరీ
దీంతో ఐదోసారి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టింది. ఇక 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగనుండటం విశేషం. ఇక అంతకుముందు.. ఆంధ్రకు చెందిన తేజ నిడమనూరు సైతం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగి.. నెదర్లాండ్స్‌ను గెలిపించాడు. 

తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో
అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌తో తలపడనుంది.  హైదరాబాద్‌లో  ఈ మ్యాచ్‌ జరుగుతుంది. తదుపరి నవంబర్‌ 11న బెంగళూరులో భారత్‌ను ఢీకొట్టనుంది.

వన్డే ప్రపంచకప్‌-2023 జట్టుకు నెదర్లాండ్స్‌ జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్.

చదవండి: Ind vs Pak: నెట్స్‌లో శ్రమించిన రాహుల్‌.. కోహ్లి, రోహిత్‌ డుమ్మా!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)