Breaking News

సందీప్‌ లమిచానేకు భారీ ఊరట.. నేపాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం

Published on Wed, 02/01/2023 - 16:59

Sandeep Lamichhane: నేపాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తమ ఆటగాడు సందీప్‌ లమిచానేకు భారీ ఊరట కలిగించింది. అతడిపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న నేపాల్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌ 2 ట్రై సిరీస్‌లో ఆడేందుకు లమిచానేకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని నేపాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బ్రిటాంట్‌ ఖనాల్‌ ధ్రువీకరించాడు.

అత్యాచార ఆరోపణలతో అరెస్టు
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన ఖనాల్‌.. కోర్టు షరతులకు లోబడే ప్రస్తుతం అతడిని స్వదేశంలో సిరీస్‌ ఆడేందుకు అనుమతించామని పేర్కొన్నాడు. ఒకవేళ నేపాల్‌ జట్టు విదేశాల్లో సిరీస్‌ ఆడేందుకు వెళ్లాల్సి వస్తే న్యాయస్థానం చెప్పినట్లుగానే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కాగా 22 ఏళ్ల సందీప్‌ లమిచానే అత్యాచార ఆరోపణలతో గతేడాది సెప్టెంబరులో అరెస్టైన సంగతి తెలిసిందే.

బెయిలు మంజూరు
ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడికి ఇటీవలే పఠాన్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో విముక్తి లభించింది. అయితే, తీర్పు వచ్చేంత వరకు దేశం వదిలివెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఈ మేరకు అతడిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో స్వదేశంలో నమీబియా, స్కాట్లాండ్‌తో జరుగనున్న ట్రై సిరీస్‌లో అతడు ఆడనున్నాడు.

సుప్రీంకోర్టుకు వెళ్తాం
కాగా నేపాల్‌ కెప్టెన్‌గా ఉన్న సందీప్‌ లమిచానే.. ఐపీఎల్‌ సహా బీబీఎల్‌, పీఎస్‌ఎల్‌, బీపీఎల్‌, సీపీఎల్‌ వంటి టీ20 లీగ్‌లలో ఆడాడు. ఇదిలా ఉంటే లమిచానేకు బెయిల్‌ లభించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అటార్నీ జనరల్‌ ఆఫీస్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపినట్లు ట్రిబ్యూన్‌ పేర్కొంది.

చదవండి: Suryakumar Yadav: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు
Johnson Charles: విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్‌ వీరుడి సునామీ శతకం

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?