Breaking News

దోహా డైమండ్‌ లీగ్‌తో...

Published on Wed, 02/12/2025 - 03:14

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్‌పై అడుగు పెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్‌ లీగ్‌ ఈవెంట్‌లో నీరజ్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెట్లిక్స్‌ చీఫ్‌ కోచ్‌ రాధాకృష్ణన్‌ నాయర్‌ వివరాలు వెల్లడించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నీరజ్‌ ప్రస్తుతం ప్రాక్టీస్‌ ప్రారంభించినట్లు రాధాకృష్ణన్‌ పేర్కొన్నాడు. 

ఒక సీజన్‌లో 14 డైమండ్‌ లీగ్‌ మీట్‌లు జరగనుండగా... దోహా ఈవెంట్‌ అందులో మూడోది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్‌లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్‌ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్‌ జాన్‌ జెలెజ్నీ (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి పోచెఫ్‌స్టోమ్‌లో శిక్షణ పొందుతున్నాడు. 

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన నీరజ్‌ చోప్రా 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు కూడా పోచెఫ్‌స్ట్రోమ్‌లోనే సాధన చేశాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్‌... 90 మీటర్ల మార్క్‌ దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)