Breaking News

‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌’తో నీరజ్‌ చోప్రా కటీఫ్‌

Published on Tue, 01/06/2026 - 05:31

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, రెండు ఒలింపిక్‌ పతకాల విజేత నీరజ్‌ చోప్రా సుదీర్ఘ కాలంగా ‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌’తో కొనసాగిన అనుబంధాన్ని ముగించాడు. 2016 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ కంపెనీ నీరజ్‌ చోప్రా మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు చూస్తూ వచి్చంది. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ ప్రోగ్రాంలో భాగంగా ఆరంభంలో జత కట్టిన అథ్లెట్లలో నీరజ్‌ ఒకడు. ఈ సంస్థతో విడిపోతూ నీరజ్‌ తన సొంత అథ్లెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘వెల్‌ స్పోర్ట్స్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. 

అటు నీరజ్, ఇటు జేఎస్‌డబ్ల్యూ కూడా ఎలాంటి వివాదం లేకుండా పరస్పర ఒప్పందంతోనే ఈ బంధానికి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాయి. ‘గత పదేళ్లుగా నా అద్భుత ప్రయాణం, ఎదుగుదలలో జేఎస్‌డబ్ల్యూ కీలక పాత్ర పోషించింది. వారు అందించిన సహకారానికి ఎప్పటికీ కృతజు్ఞడను’ అని నీరజ్‌ వ్యాఖ్యానించాడు. ‘నీరజ్‌తో కలిసి పని చేయడం గొప్ప గౌరవం. ఆటకు సరైన సహకారం అందిస్తే అద్భుతాలు జరుగుతాయనే మా నమ్మకానికి అతడి విజయాలు సరైన ఉదాహరణ’ అని జేఎస్‌డబ్ల్యూ సీఈఓ దివ్యాంశు సింగ్‌ అన్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్‌ చోప్రా...2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు.   

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)