కోచ్‌కు గుడ్‌బై చెప్పిన నీరజ్‌ చోప్రా

Published on Sun, 01/11/2026 - 07:51

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన నీరజ్‌ చోప్రా... దిగ్గజ కోచ్‌ జాన్‌ జెలెన్‌జీ (చెక్‌ రిపబ్లిక్‌) నుంచి వేరయ్యాడు. ఏడాది కాలంగా జెలెన్‌జీ వద్ద శిక్షణ పొందిన నీరజ్‌ సానుకూల వాతావరణంలోనే దారులు మార్చుకున్నట్లు శనివారం వెల్లడించాడు. జావెలిన్‌ త్రోలో ప్రపంచ రికార్డు సాధించిన ఈ చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెట్‌... కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారాడు. అతడి శిక్షణలో మరింత రాటుదేలిన నీరజ్‌ చోప్రా గతేడాది కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. 

చిన్నప్పటి నుంచి ఆరాధించిన జెలెన్‌జీ వద్ద శిక్షణ పొందడం ఎంతో గొప్ప విషయమని నీరజ్‌ పేర్కొన్నాడు. ‘జెలెన్‌జీ వద్ద శిక్షణతో ఎన్నో విషయాల్లో నా ఆలోచన సరళి మారింది. టెక్నిక్, రిథమ్‌ వంటి వాటిలో అతడి ప్రోత్సాహం మరవలేనిది. ఒక్క సీజన్‌లోనే జెలెన్‌జీ నుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితం మొత్తం ఆరాధించిన వ్యక్తి ఒక స్నేహితుడిగా మారి మార్గనిర్దేశం చేయడం ఎప్పటికీ మరవలేను. అతడు కేవలం అత్యుత్తమ జావెలిన్‌ త్రోయర్‌ మాత్రమే కాదు. 

అంతకుమించి మంచి మనిషి అని నీరజ్‌ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నట్లు నీరజ్‌ వెల్లడించాడు. మరోవైపు దీనిపై జెలెన్‌జీ స్పందిస్తూ... ‘నీరజ్‌ వంటి అథ్లెట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. అతడిని కలవడం సంతోషంగా ఉంది. నా శిక్షణ కాలంలో అతడు 90 మీటర్ల మార్క్‌ దాటడం సంతృప్తినిచి్చంది. భవిష్యత్తులోనూ అతడితో బంధం కొనసాగుతుంది’ అని 59 ఏళ్ల జెలెన్‌జీ పేర్కొన్నాడు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)