Breaking News

నీరజ్‌ చోప్రాకు షాక్‌.. సెంటీమీటర్‌ తేడాతో టైటిల్‌ మిస్‌

Published on Sun, 09/15/2024 - 07:50

డైమండ్ లీగ్‌-2024లో పారిస్ ఒలింపిక్స్ విజేత‌, భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రాకు మ‌ళ్లీ నిరాశే ఎదురైంది.బ్రెస్సెల్స్ వేదిక‌గా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సెంటీమీటర్ తేడాతో టైటిల్‌ను భారత బల్లెం వీరుడు కోల్పోయాడు. నీరజ్ తన మూడో ప్రయత్నంలో 87.86తో అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. 

శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ తుది పోరులో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈటెను 87.87 విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. దీంతో పీటర్స్ ప్రతిష్టాత్మక డైమండ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 

విజేతగా నిలిచిన పీటర్స్ కంటే కేవలం 0.01 మీటర్లు మాత్రమే నీరజ్‌ వెనుకబడ్డాడు. కాగా గతేడాది కూడా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ రెండో స్ధానంలో నిలిచి టైటిల్‌ను మిస్స్ అయ్యాడు. ఆ ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా తన ఈటెను 83.80 దూరం విసిరి రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు.

 చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్‌ వాడ్లేజ్‌ 84.24 దూరం విసిరి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది లీగ్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: ‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)